M.P వంశికృష్ణ అధికారిక పర్యటన సందర్భంగా ప్రోటోకాల్‌ను పాటించకుండా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు మరియు స్థానిక నాయకులు డిమాండ్ చేశారు.
ఎంపీ హాజరైన ప్రభుత్వ కార్యక్రమంలో సంబంధిత విభాగాల అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం, స్వాగతం మరియు సమన్వయం వంటి అనివార్య ప్రోటోకాల్ విధులను పాటించకపోవడంతో వివాదం చెలరేగింది. ఇది ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం కలిగించే చర్యగా పేర్కొంటూ బాధ్యులను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఎంపీ వంశికృష్ణ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరుగకూడదని, పాలన పట్ల ప్రజల్లో నమ్మకం దెబ్బతినకుండా అధికార యంత్రాంగం బాధ్యతగా వ్యవహరించాలని నేతలు సూచిస్తున్నారు.
