తెలంగాణ శాసనసభ వేదికగా నేడు ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ, సభా మర్యాదలను పాటిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ పరస్పరం పలకరించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాకముందే ప్రతిపక్ష నేత కేసీఆర్ సభలోకి చేరుకుని తన కేటాయించిన సీటులో కూర్చున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ హాల్‌లోకి రాగానే నేరుగా కేసీఆర్ వద్దకు వెళ్లారు. చిరునవ్వుతో ఆయనకు కరచాలనం (Handshake) చేసి కుశలప్రశ్నలు అడిగారు.
సీఎంను అనుసరిస్తూ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ వద్దకు వెళ్లి ఆయనను పలకరించారు. కొద్దిసేపు సభలో గడిపిన అనంతరం కేసీఆర్.. హరీష్ రావుతో కలిసి అసెంబ్లీ నుండి బయటకు వచ్చి నంది నగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.ఈ అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయ విబేధాలు పక్కన పెట్టి నాయకులు ఇలా గౌరవించుకోవడం ప్రజాస్వామ్యానికి శుభపరిణామమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
