మహేశ్వరం ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు, రాచకొండ సీపీ సుధీర్ బాబు (ఐపీఎస్) సహా ఇతర విభాగాల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా, తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేసేలా ఏర్పాట్లు ఉండాలని మంత్రి ఆదేశించారు.ఐదో తేదీలోపు అన్ని పనులను పూర్తి చేయాలి.ఆరో తేదీన డ్రై రన్ (Dry Run) కండక్ట్ చేయాలి.
ఏ ఒక్క చిన్న పొరపాటు జరగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలి.

ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, ముఖ్యంగా పార్కింగ్, లాజిస్టిక్స్, ఆతిథ్యం (Hospitality), పరిశుభ్రత (Sanitation) వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు.
విభాగాల వారీగా అప్పగించిన బాధ్యతలు, వాటి పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
