శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్)లో సోమవారం బాంబు బెదిరింపు మెయిల్ కలకలం సృష్టించింది. ఒకేసారి మూడు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
బెదిరింపు అందుకున్న విమానాలు,ఇండిగో ఎయిర్‌లైన్స్ (కేరళ, కన్నూర్ – హైదరాబాద్).లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ (ఫ్రాంక్‌ఫర్ట్ – హైదరాబాద్).బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ (లండన్ – హైదరాబాద్)

విమానాలకు బెదిరింపులు అందిన వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయా విమానాల్లోని ప్రయాణికులను కిందకు దించి, ఐసోలేషన్ ప్రాంతాలకు తరలించారు.
బెదిరింపులు వచ్చిన మూడు విమానాలను బాంబు స్క్వాడ్ బృందాలు, డాగ్ స్క్వాడ్‌లతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.ఈ బెదిరింపు మెయిల్స్ వెనుక దుండగులు ఎవరు, వారి ఉద్దేశం ఏమిటనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
