కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య పాల్గొన్నారు.

M.P DR. కడియం కావ్య సోనియా గాంధీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు ఇండియా కూటమికి చెందిన యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌తో సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేతలు కేక్ కట్ చేసి సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు.
