వర్షిత మృతితో ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తూ, కేటీఆర్ మాట్లాడుతూ, “ఇలాంటి సంఘటనలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి” అన్నారు.
వివరాల ప్రకారం, పాఠశాలలో ప్రతిభావంతురాలిగా పేరు గాంచిన వర్షిత ఇటీవలే జిల్లా కలెక్టర్ చేత సన్మానించబడింది. ఆమె స్కూల్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. అయితే, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌ల వేధింపులు, అవినీతి ఆరోపణలు కారణంగా మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.మరణానికి గంట ముందు వర్షిత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి వేధింపుల గురించి చెప్పినట్లు తెలిసింది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
