CM రేవంత్ రెడ్డి హుస్నాబాద్‌లో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హుస్నాబాద్ చరిత్ర, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

ఇది సర్దార్ సర్వాయి పాపన్న నేతృత్వంలో బహుజన రాజ్యానికి పునాదులు వేసిన గడ్డ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కరీంనగర్ ప్రజలు కీలక పాత్ర పోషించారు కాబట్టే, కరీంనగర్ వేదికగా సోనియమ్మ రాష్ట్ర ఏర్పాటుకు మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు అని గుర్తు చేశారు.

సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ప్రధాని మోడీని ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు ఆహ్వానించినట్లు తెలిపారు.
ఇది ప్రజలు తమ ఓటును ఆయుధంగా మార్చి దుర్మార్గ పాలనను అంతమొందించి ప్రజా పాలన తీసుకొచ్చిన రోజు అని, తెలంగాణ కోసం శ్రీకాంత చారి అమరుడైన రోజు అని గుర్తుచేశారు.
