వేములవాడకు చెందిన ఏదుల సత్తమ్మ అనే బాధితురాలు విచిత్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆమెకు సంబంధించిన డబ్బులు పొరపాటున రాజన్న ఆలయం (వేములవాడ) బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయి.
సత్తమ్మకు సంబంధించిన వంట గ్యాస్ సబ్సిడీ డబ్బులు గత కొంతకాలంగా ఆలయ అకౌంట్‌లో జమవుతుండగా, తాజాగా ఆమె పత్తి అమ్మగా వచ్చిన రూ.2,14,000 (రెండు లక్షల పధ్నాలుగు వేలు) కూడా రాజన్న ఆలయ అకౌంట్‌లోనే జమ అయ్యాయి.
సత్తమ్మ ఆధార్ నంబర్ పొరపాటున రాజన్న ఆలయ బ్యాంకు ఖాతాకు అనుసంధానం కావడం ఈ గందరగోళానికి కారణమని తెలుస్తోంది.
తమ డబ్బులు తమకు ఇవ్వాలని ఆలయ ఈవోను అడిగితే, ఇది తమ తప్పు కాదని, బ్యాంకు అధికారులను సంప్రదించాలని సూచించినట్లు బాధితులు వాపోతున్నారు.

తమ డబ్బుల కోసం బాధితులు ప్రస్తుతం సీసీఐ (CCI – కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) మరియు ఆలయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
