రాజన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. మేడారం జాతర సమీపిస్తుండటంతో, ముందుగా రాజన్నకు మొక్కులు చెల్లించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుండే ధర్మగుండం వద్ద స్నానాలు ఆచరించి, కోడె మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాజన్న అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయాన్ని నేటి నుండి 24 గంటల పాటు తెరిచి ఉంచనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.

వచ్చే ఏడాది (2026) జనవరి 4, 11, 18 తేదీల్లో కూడా భీమన్న ఆలయం 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. రేపు (సోమవారం) బద్ది పోచమ్మ అమ్మవారి దర్శనాన్ని కూడా 24 గంటల పాటు కల్పించనున్నారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడె మొక్కుల కోసం భక్తులు సుమారు 3 గంటల పాటు క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు.

