Telengana :పాత నేరస్థులపై నిఘా పెంచండి వరంగల్ CP ఆదేశం

January 2, 2026 6:39 PM

నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు చోరీల నియంత్రణే లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనర్ (CP) సిటీ క్రైమ్ స్టేషన్ (CCS)లో వార్షిక తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం సిసిఎస్‌కు చేరుకున్న సీపీకి పోలీసులు గౌరవ వందనం సమర్పించగా, ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. గతంలో చోరీలకు పాల్పడి జైలు నుంచి విడుదలైన పాత నేరస్థులు, ముఖ్యంగా అంతర్రాష్ట్ర దొంగల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సీపీ అధికారులను ఆదేశించారు.

స్టేషన్‌లోని రికార్డులు, పాత నేరస్థుల ఫోటోలు మరియు కిట్ ఆర్టికల్స్‌ను సీపీ క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు చేశారు. ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన నేరస్థుల వివరాలను సేకరించి అందుబాటులో ఉంచుకోవాలని, చోరీల నివారణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో క్రైమ్స్ అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీ సదయ్య, సిసిఎస్ ఇన్‌స్పెక్టర్లు రాఘవేందర్, రామకృష్ణ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media