గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్త జె.టి.డి. రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో భాగంగా బాపట్ల జిల్లా బాపట్ల పట్టణానికి చెందిన షేక్ సయ్యద్‌ను గుర్తించి, నందివెలుగు జంక్షన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, షేక్ సయ్యద్ వైసీపీకి మద్దతుదారుడిగా సోషల్ మీడియాలో పనిచేస్తూ 2025 సెప్టెంబర్ 15న “గచ్చిబౌలి దివాకర్” పేరుతో ఫేస్‌బుక్ ఖాతా సృష్టించి, వైసీపీకి అనుకూలంగా టీడీపీ, జనసేన పార్టీలకు వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నాడు.అలాగే N. Chandrababu Naidu, Pawan Kalyan, Vangalapudi Anithaలను లక్ష్యంగా చేసుకుని అవమానకరమైన పోస్టులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.అదే విధంగా సోషల్ మీడియా కార్యకర్తల ద్వారా ఆ పోస్టులను విస్తృతంగా షేర్ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.TTD చైర్మన్‌కు సంబంధించిన వీడియో విషయంలో కూడా తెనాలి మహిళపై అపప్రధ కలిగించేలా ట్విట్టర్‌లో పోస్టులు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించినట్లు తాలూకా సీఐ షేక్ నాయిబ్ రసూల్ తెలిపారు.
