తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆయన తన పక్కనే ఉన్న భద్రతా సిబ్బందిపై అసహనం వ్యక్తం చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి దంపతులు ఒక ఆలయ సందర్శనలో భాగంగా గోవుకు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ సమయంలో జనం రద్దీ పెరగడంతో, భద్రతా సిబ్బంది ముఖ్యమంత్రికి అతి దగ్గరగా వచ్చారు. ప్రదక్షిణలకు ఆటంకం కలగడంతో అసహనానికి లోనైన సీఎం రేవంత్ రెడ్డి, తన పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డ్‌ను చేయితో వెనక్కి నెట్టడం లేదా కొట్టినట్లు వీడియోలో దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియో కేవలం కొద్ది నిమిషాల్లోనే ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లలో వైరల్ అయ్యింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా బాడీగార్డ్‌పై చేయి చేసుకోవడం సరికాదని నెటిజన్లు కొందరు విమర్శిస్తుండగా, భద్రతా సిబ్బంది అతిగా వ్యవహరించడం వల్లే సీఎం అలా చేశారని మరికొందరు సమర్థిస్తున్నారు. అయితే ఈ వీడియో ఎక్కడిది, ఏ ప్రాంతానికి సంబంధించింది అనే దానిపై అధికారికంగా ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
