TG:నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి CM రేవంత్ రెడ్డి

February 7, 2026 4:58 PM

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత అభ్యర్థులదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి ఓటరును కలవాలని సూచించారు.

నిజామాబాద్ కార్పొరేషన్ బరిలో సగం మంది మహిళా అభ్యర్థులే ఉన్నారని, ఈ ఎన్నికల్లో మహిళలే కీలకం కాబోతున్నారని సీఎం పేర్కొన్నారు.టికెట్ వచ్చిన వారు మిగిలిన అందరినీ కలుపుకుని పోవాలని, అందరూ కలిసి పనిచేస్తే 50 శాతం విజయం సాధించినట్లేనని భరోసా ఇచ్చారు. ప్రతిపక్షాలు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాయని, మనం మాత్రం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.

“మున్సిపల్ మంత్రిని నేనే.. నిజామాబాద్ అభివృద్ధికి కావాల్సిన నిధులు నేనే ఇస్తా” అని సీఎం హామీ ఇచ్చారు. పార్టీ బీ-ఫామ్ కోసం భారీ పోటీ ఏర్పడిందని, అవకాశం వచ్చిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని ఆదేశించారు.సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే ఉన్నాయని, ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా కష్టపడి నిజామాబాద్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అభ్యర్థులకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media