తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రీడోత్సవాల సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన ‘పోలీస్ వెల్ఫేర్ & వెల్నెస్ ఎక్స్పో’ సందర్శకులతో కిక్కిరిసిపోతోంది. పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో ఆధునిక పోలీసింగ్ పరికరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ట్రాఫిక్ విభాగం వాడే స్పీడ్ లేజర్ గన్స్, బాడీ ప్రొటెక్షన్ గేర్, డ్రంకెన్ డ్రైవ్ మెషీన్ల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ఉచిత ఆరోగ్య పరీక్షలు, యోగా, పోషకాహార సూచనలు మరియు ఆర్గానిక్ ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటు చేశారు. జైళ్ల శాఖ తయారు చేసిన ఉత్పత్తులు, ఆధునిక ఆపరేషన్ పరికరాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.ఈ ఎక్స్పో శనివారం వరకు కొనసాగనుంది. పోలీసుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని అధికారులు వెల్లడించారు.

