మున్సిపల్ ఎన్నికల వేళ సంగారెడ్డిలో రాజకీయ సెగలు తారాస్థాయికి చేరాయి. బుధవారం 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థిని సీఐ దూషించారని, బీఆర్ఎస్ రిగ్గింగ్‌కు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన బూతు పురాణం అందుకున్నారు.
ఆ సీఐ గాం*డు గాడు..!!
నువ్వు సినిమా హీరో అనుకుంటున్నావా..?
పోలీసులను లం* కొడుకులు అంటూ తిట్టిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ఒక అమ్మా అబ్బకు పుడితే ఇటు రండి..
నువ్వు అంత మోగొనివా..? అంటూ పోలీసుల ముందు జగ్గారెడ్డి బూతు పురాణం.. చోద్యం చూస్తూ నిల్చున్న పోలీసులు..
విధి నిర్వహణలో ఉన్న అధికారులను దూషించినందుకు జగ్గారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించి, జగ్గారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల ముందు జగ్గారెడ్డి చేసిన బూతు వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై పోలీస్ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
