తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సాధువులు, సన్యాసుల సందడి నెలకొంది. గోదావరి ప్రదక్షిణ యాత్రలో భాగంగా దాదాపు 500 మందికి పైగా సాధువులు ఆదివారం కాళేశ్వరం చేరుకున్నారు.
ఉత్తరప్రదేశ్ (యూపీ) రాష్ట్రానికి చెందిన ఈ సాధువులు గోదావరి పరిక్రమణ యాత్రలో భాగంగా యానాం నుంచి కాళేశ్వరానికి చేరుకున్నారు.సాధువులు, సన్యాసులు త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు.

ఆలయం చుట్టూ సాధువుల రాకతో భక్తి, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
