TG :మాచారెడ్డిలో విషాదం ఇద్దరు ప్రాణ స్నేహితుల మృతి

December 26, 2025 6:16 PM

జిల్లాలోని మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. పని నిమిత్తం బయటకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు తిరిగి వస్తుండగా మృత్యువు కబళించింది.
లచ్చపేట గ్రామానికి చెందిన అజయ్, సాయి అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు బైక్‌పై మాచారెడ్డి చౌరస్తాకు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తుండగా ప్రమాదం జరిగింది.

లచ్చపేట గ్రామ శివారులోని సబ్ స్టేషన్ వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వీరి బైక్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఇద్దరూ ప్రాణాలు విడిచారు. ఇద్దరు స్నేహితుల మరణంతో లచ్చపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media