TG :ఉద్యమకారుడి బిడ్డకు KCR అండ

January 24, 2026 2:26 PM

తనను నమ్ముకున్న నాయకుడి కుటుంబానికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కొండంత అండగా నిలిచారు. ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, దివంగత కుసుమ జగదీశ్ కుమార్తె సుకీర్తి వైద్య విద్య (మెడిసిన్) అభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని ఆయన అందజేశారు.

జగదీశ్ అకాల మరణంతో ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందులు, సుకీర్తి మెడిసిన్ చదవాలనే ఆకాంక్షను తెలుసుకున్న కేసీఆర్ తక్షణమే స్పందించారు.శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో సుకీర్తిని కలిసిన కేసీఆర్, ఆమె మెడిసిన్ ఫీజుకు సంబంధించిన చెక్కును స్వయంగా అందజేశారు.”మంచిగా చదువుకుని గొప్ప డాక్టరుగా పేరు తెచ్చుకోవాలి.. మీ కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని సుకీర్తిని కేసీఆర్ దీవించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media