TG KTR వర్సెస్ రేవంత్ నేను 4 భాషల్లో తిట్టగలను

December 27, 2025 4:33 PM

తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం మరియు ఆయన రాజకీయ పునరాగమనంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తన తండ్రిపై వ్యక్తిగత దాడులు చేస్తున్న వారికి ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు.

కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టగానే కొందరు జంతువుల్లా మొరగడం మొదలుపెట్టారని కేటీఆర్ మండిపడ్డారు. 72 ఏళ్ల వయస్సున్న నాయకుడిని పట్టుకొని చనిపోవాలని శాపనార్థాలు పెట్టడం, ఆయన కాలు విరిగినప్పుడు సంతోషించడం మీ సంస్కారమా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి కేవలం ఒకే భాషలో (తెలుగు) తిట్టడం వచ్చు కావొచ్చు.. కానీ తాను తలుచుకుంటే తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ వంటి మూడు, నాలుగు భాషల్లో తిట్టగలనని కేటీఆర్ స్పష్టం చేశారు. “మా అమ్మనాన్నలు నాకు సంస్కారం నేర్పారు. అలాగే ముఖ్యమంత్రి కుర్చీకి ఉన్న గౌరవం దృష్ట్యా నేను సంయమనం పాటిస్తున్నా.. అంతేకానీ మా అసమర్థత కాదు” అని ఆయన తేల్చి చెప్పారు.”మా అయ్య తెలంగాణ తెచ్చిన మొనగాడు ఆయన పేరు బరాబర్ చెప్పుకుంటా” అంటూ కేసీఆర్ ఘనతను ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media