TG మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు ప్రారంభం: మంత్రి సీతక్క

January 23, 2026 11:15 AM

ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ములుగు జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో థంబి ఏవియేషన్ సంస్థ ఏర్పాటు చేసిన ఈ సర్వీసులను రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ (సీతక్క) గురువారం ప్రారంభించారు.

హనుమకొండ నుండి మేడారం వెళ్లి రావడానికి (Up & Down) ఒక్కొక్కరికి రూ. 31,000 గా ధర నిర్ణయించారు. కేవలం మేడారం పరిసర ప్రాంతాలను గాలిలో వీక్షించేందుకు (Aerial View) రూ. 4,800 టికెట్ ధర ఖరారు చేశారు. ఈ హెలికాప్టర్ సేవలు నేటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. గత పాలకుల కంటే భిన్నంగా ప్రజా ప్రభుత్వం మేడారం అభివృద్ధి కోసం రూ. 251 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు.

Booking వివరాలు: భక్తులు 9676320139, 8530004309 ఫోన్ నంబర్లు లేదా www.helitaxii.com వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media