కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై Ex Minister KTR చేసిన వ్యాఖ్యలపై వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హన్మకొండ కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్, కవితలపై నిప్పులు చెరిగారు.

రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి KTRకు లేదని, పద్ధతి మార్చుకోకపోతే వరంగల్ నగరానికి వస్తే చెప్పులతో కొట్టిస్తామని ఘాటుగా హెచ్చరించారు. ఒక మహిళ అయి ఉండి MLC కవిత అసభ్యకర పదజాలంతో మాట్లాడుతున్నారని, గతంలో ఇదే కుటుంబం సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్న విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు.
CM రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటివరకు సంయమనం పాటించామని, ఇకపై KTR కుటుంబం నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో KTRకుటుంబాన్ని ప్రజలే సామాజికంగా బహిష్కరించే రోజులు దగ్గరపడ్డాయని నాయిని వ్యాఖ్యానించారు.
