TG:ములుగు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు..

March 23, 2026 3:01 PM

ములుగు జిల్లా కోర్టుకు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది.

జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ ద్వారా కోర్టులో బాంబు పెట్టామని హెచ్చరించారు.ఈ విషయాన్ని కోర్టు సిబ్బంది జిల్లా జడ్జికి తెలియజేయగా, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో కలిసి కోర్టు ప్రాంగణంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసి, అనుమానాస్పద వస్తువుల కోసం పరిశీలనలు కొనసాగిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media