పెళ్లైన నాలుగు నెలలకే భార్య అసలు రూపం బయటపడటంతో ఓ భర్త వీధికెక్కాడు. భార్య మోసాన్ని తట్టుకోలేక, ఆమె ప్రియుడి ఇంటి ముందు ఫ్లెక్సీ కట్టి మరీ ధర్నాకు దిగిన ఘటన నిజామాబాద్‌లో సంచలనం సృష్టిస్తోంది.ప్రశాంత్ అనే వ్యక్తికి గతేడాది ఆగస్టు 13న సంయుక్త అనే మహిళతో వివాహమైంది. అయితే, పెళ్లికి ముందే ఆమెకు తన బావ వరుసైన లింబాద్రితో సంబంధం ఉందని, పెళ్లయ్యాక కూడా అది కొనసాగుతోందని ప్రశాంత్ గుర్తించాడు.

భార్య తన ప్రియుడితో జరిపిన వాట్సాప్ చాటింగ్‌ను ప్రశాంత్ కనిపెట్టాడు. ఆ చాటింగ్ స్క్రీన్ షాట్లను సేకరించి, తన భార్య మోసాన్ని సోషల్ మీడియాలో స్టేటస్‌లుగా పెట్టి నిరసన తెలిపాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ భార్య ప్రియుడు లింబాద్రి ఇంటి ముందు ప్రశాంత్ ఫ్లెక్సీతో బైఠాయించాడు. “నా జీవితాన్ని నాశనం చేసిన వీరికి శిక్ష పడాలి” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. భార్య అక్రమ సంబంధానికి సంబంధించిన అన్ని ఆధారాలు చూపించినా పోలీసులు పట్టించుకోవడం లేదని, బాధితుడైన తనకు న్యాయం చేయాలని ప్రశాంత్ డిమాండ్ చేస్తున్నాడు.
