TG ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముసుగు దొంగల ముఠా హల్‌చల్

December 27, 2025 2:40 PM

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలు ప్రజల నిద్ర లేకుండా చేస్తున్నాయి. గస్తీ ముమ్మరం చేసినట్లు పోలీసులు చెబుతున్నా, దొంగలు మాత్రం బ్యాంకు ఏటీఎంలు, తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకొని పోలీసులకు సవాల్ విసురుతున్నారు.

నిజామాబాద్ నగరంలోని ఆర్య నగర్ డీసీబీ (DCB) బ్యాంకు, వర్ని చౌరస్తాలోని ఎస్బీఐ (SBI) ఏటీఎంలను గ్యాస్ కట్టర్లతో ధ్వంసం చేసిన దొంగలు, సుమారు రూ. 45 లక్షలు ఎత్తుకెళ్లారు. వర్ని రోడ్డు వద్ద ఏటీఎం కత్తిరించే క్రమంలో మంటలు రావడంతో కొన్ని నోట్లు కాలిపోయాయి. కామారెడ్డిలోని ఓల్డ్ ఎస్పీఆర్, ఆర్కే నగర్ కాలనీల్లో మారణాయుధాలతో ముసుగు దొంగలు రెక్కీ నిర్వహిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

నివాసాలు, దుకాణ సముదాయాల్లో వరుస చోరీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తాళం వేసి ఉన్న ఇళ్లను పసిగట్టి ఈ ముఠా దోపిడీలకు పాల్పడుతోంది.దొంగతనాలను సవాల్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తమ ఇంటి తాళాల గురించి పొరుగువారికి లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media