గౌలిదొడ్డిలో ‘సప్త శక్తి సంగం’ విద్యారణ్య స్కూల్ ఆత్మీయ సమ్మేళనం

January 23, 2026 6:21 PM

నగరంలోని గౌలిదొడ్డి ప్రాంతంలో శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో ‘సప్త శక్తి సంగం’ కార్యక్రమం ఆత్మీయ భరితంగా జరిగింది. సమాజ నిర్మాణంలో మహిళల పాత్రను కొనియాడుతూ, వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ చింతల గట్టు, వైష్ణవి హాజరుకాగా, అడ్మిన్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి, రిటైర్డ్ ప్రొఫెసర్ విజయ విశిష్ట అతిథులుగా విచ్చేశారు.ఉమ్మడి కుటుంబాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న సవరమ్మను ప్రత్యేకంగా సత్కరించారు. మహిళల ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలపై వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి, అధ్యాపకురాలు కృష్ణవేణి ప్రసంగించారు. సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ‘పంచ పరివర్తన్’ (కుటుంబ ప్రబోధన్, పర్యావరణం వంటి అంశాలు) భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్లు స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి వివరించారు. సంస్కార కేంద్రం ద్వారా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సుధారాణి, పద్మశ్రీ, నవీన్, నందిని ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media