తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే, తాజాగా విజయ్ భార్య సంగీత, కుమారుడు జేసన్ సంజయ్ కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో ఈ పుకార్లకు తెరపడినట్లయింది.

విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత జరిగిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో సంగీత కనిపించకపోవడంతో విడాకుల వార్తలు ఊపందుకున్నాయి. చాలా కాలం తర్వాత ఆమె తన కుమారుడితో కలిసి బహిరంగంగా కనిపించడం గమనార్హం. విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ త్వరలోనే దర్శకుడిగా తెరంగేట్రం చేయబోతున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఓ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించనున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో క్యాజువల్ లుక్స్‌లో ఉన్న వీరిద్దరి ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. విజయ్ అభిమానులు “ఆల్ ఈజ్ వెల్” అంటూ ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు.
