చికిత్స కోసం వచ్చిన యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన డాక్టర్‌ను పేషంట్ బంధువులు చితకబాదిన ఘటన తొర్రూరు పట్టణంలో చోటుచేసుకుంది.
జ్వరంతో చికిత్స కోసం వచ్చిన 21 ఏళ్ల యువతికి ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత Dr. Kiran Kumar అనే వైద్యుడు ఆమెపై అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. యువతి అందంగా ఉన్నావని వ్యాఖ్యలు చేస్తూ అనుచితంగా ప్రవర్తించడంతో భయపడిన యువతి వెంటనే తన భర్తకు వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చింది.దీంతో ఆస్పత్రికి చేరుకున్న బంధువులు డాక్టర్‌ను ప్రశ్నించగా అతను నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆగ్రహించిన మహిళలు సహా బంధువులు డాక్టర్‌పై దాడి చేశారు. అనంతరం పోలీసులు డాక్టర్‌ను అదుపులోకి తీసుకుని Thorrur Police Stationలో విచారణ చేపట్టారు.
