మన్యం ప్రాంతాల్లో ప్రజానికానికి కంటి మీద కునుకు లేకుండా చేసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపం లో బంధించిన పెద్దపులిని పట్టుకుని విశాఖలో ఉన్న యానిమల్ రెస్క్యూ సెంటర్ కు తరలించిన విషయం విదితమే..
అయితే విశాఖ జంతు ప్రదర్శన శాల పునరావాస కేంద్రంలో వారం రోజులపాటు పెద్దపులి ఆరోగ్యం, మానసిక స్థితిని వైద్యులు పరిశీలించి పెద్దపులి ఆరోగ్యంగా ఉందని నిర్ధారించారు.అనంతరం పోలవరం జిల్లా అటవీ శాఖా ధికారి ఆధ్వర్యంలో రెస్క్యూ టీమ్ వచ్చి పెద్దపు లిని తీసుకువెళ్లి పాపికొండల్లోని జాతీయ అభయారణ్యంలో విడిచిపెట్టింది.పాపికొండల అభయారణ్యంలో పెద్ద పులులు సంచరిస్తున్నట్టు ఆనవాళ్లు ఉన్నాయని అభయారణ్యం పెద్ద పులులకు సురక్షితమని భావించి అక్కడ విడిచి పెట్టినట్లు అటవీ సంరక్షణ అధికారి ఎం. దివాన్ మైదిన్ తెలిపారు..
