Kadapa district లోని Chapadu మండలం ఎన్ఓబయపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తిప్పిరెడ్డిపల్లి గ్రామానికి రహదారి నిర్మించాలని మహిళలు, విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు.
గ్రామానికి వెళ్లే రహదారి పగలగొట్టి నెలలు గడిచినా మరమ్మతులు చేపట్టకపోవడంతో రోడ్డు మొత్తం బురద నీటితో నిండిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. రహదారి అధ్వానంగా ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా గ్రామంలోకి రావడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యపై అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేకపోవడంతో మహిళలు, విద్యార్థులు బురదలో మోకాళ్లపై నిల్చొని నిరసన చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే రహదారి నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
