శాసనమండలిలోతిరుమల లడ్డూ నెయ్యి వివాదం:

March 5, 2026 4:11 PM

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ అంశంపై తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గురువారం జరిగిన స్వల్పకాలిక చర్చలో అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.

దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా నిబంధనలు సడలించి తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని విమర్శించారు. ఎన్డీడీబీ నివేదికలో లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్లు తేలిందని తెలిపారు.దీనికి ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ, రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. హెరిటేజ్ సంస్థ పేరు ప్రస్తావన రావడంతో సభలో మరింత గందరగోళం నెలకొంది


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media