స్టార్ల కటౌట్లు ఉన్నా సిస్టమ్ క్రాష్. 2026 ఫస్టాఫ్ బాక్సాఫీస్ రిపోర్ట్…

July 2, 2026 3:08 PM
Tollywood 2026 first-half box office winners and losers.

మెగాస్టార్, సమంతలదే అసలైన ఫ్లెక్స్

Tollywood: 2026 ఫస్టాఫ్ టాలీవుడ్ రిపోర్ట్ కార్డ్ చూస్తే… సీన్ చాలా మిక్స్‌డ్‌గా ఉంది. ఇయర్ స్టార్టింగ్‌లో ఉన్న హైప్, సంక్రాంతి లైనప్స్ చూసి ఈసారి టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలే అనుకున్నారు. కానీ 6 నెలలు తిరిగేసరికి సీన్ రివర్స్ అయింది. 100కి పైగా సినిమాలు థియేటర్లలోకి వస్తే, అందులో 95శాతం పైగా సినిమాలు డిజాస్టర్ జోన్‌కే వెళ్ళాయి.
ఈ సిక్స్-మంత్స్ టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్‌ ఎలా ఉందో చూద్దాం.

ఈ ఆరు నెలల్లో ఇండస్ట్రీకి ఊపిరి పోసి, బయ్యర్లకి కాసుల వర్షం కురిపించిన సినిమాలు కొన్ని ఉన్నాయి. మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి విన్నర్. మెగాస్టార్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించి, 2026 ఫస్ట్ క్లీన్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వెంకీ మామ క్యామియో అదనపు ప్లస్.

మా ఇంటి బంగారం ఈ ఇయర్ ‘మోస్ట్ ప్రాఫిటబుల్’ సర్ప్రైజ్ హిట్ ఇదే. సమంత రీఎంట్రీ అదిరిపోయింది. రూ. 65 కోట్ల వసూళ్లతో, పెట్టిన పెట్టుబడికి ఏకంగా 3 రెట్లు లాభాలు తెచ్చిపెట్టింది.

అనగనగా ఒక రాజు టాక్ యావరేజ్ వచ్చినా, నవీన్ కామెడీ టైమింగ్ అండ్ పండుగ సెలవులు కలిసి రావడంతో రూ. 75 కోట్లు కొల్లగొట్టి సేఫ్ జోన్‌లోకి వెళ్ళిపోయింది.

నారి నారి నడుమ మురారి పెద్ద సినిమాల క్లాష్‌లోనూ ఈ రొమాంటిక్ కామెడీ క్లీన్ హిట్ టాక్ తెచ్చుకుని బయ్యర్లను బ్రతికించింది.

జూన్‌లో వచ్చిన పెద్ది సినిమా కలెక్షన్ల పరంగా రూ. 330 కోట్లతో ఈ ఏడాది నంబర్ వన్ టాప్ గ్రాసర్‌గా ఉంది. కానీ… ఆంధ్రాలో ప్రాఫిట్స్ వస్తే, తెలంగాణాలో జస్ట్ బ్రేక్ ఈవెన్ అయింది. యూఎస్, నార్త్ ఇండియా మార్కెట్లలో మాత్రం దారుణంగా నష్టపోయింది. సో, దీన్ని క్లీన్ హిట్ అనలేం.

కపుల్ ఫ్రెండ్లీ, రాకాస, సింగ్ గీతం… ఈ సినిమాలకి క్రిటిక్స్ నుంచి మంచి రేటింగ్స్ వచ్చాయి, ఓపెనింగ్స్ కూడా బాగుండేవి. కానీ థియేటర్లలో ఎక్కువ రోజులు హోల్డ్ చేయలేక యావరేజ్ స్టేటస్‌తో సరిపెట్టుకున్నాయి. విష్ణు విన్యాసం, బ్యాండ్ మేళం కూడా ఇదే కేటగిరీ.

ది రాజా సాబ్… సంక్రాంతి బరిలో వచ్చిన ఈ హారర్-కామెడీ ఆడియన్స్‌కు అస్సలు ఎక్కలేదు. 2026 ఫస్టాఫ్‌లోనే అత్యంత భారీ నష్టాలు మిగిల్చిన నంబర్ వన్ డిజాస్టర్ ఇది.

ఉస్తాద్ భగత్ సింగ్ ఇండస్ట్రీకి ఇది గట్టి షాక్. పవన్ కళ్యాణ్ సినిమాకి ఫస్ట్ రోజే ఓపెనింగ్స్ డ్రాప్ అవ్వడం, నెగెటివ్ టాక్ రావడంతో సెకండ్ డే నుంచే థియేటర్లు ఖాళీ అయిపోయాయి. బిగ్గెస్ట్ ఫ్లాప్స్‌లో ఒకటిగా మిగిలింది.

భర్త మహాశయులకు విజ్ఞప్తి …రవితేజ మాస్ పవర్ కూడా ఈసారి వర్కవుట్ కాలేదు, ట్రేడ్‌ని బాగా నిరాశపరిచింది. డెకాయిట్, ఫంకీ, సీతా పయనం, యుఫోరియా, బైకర్, మృత్యుంజయ, సతీ లీలావతి, జెట్‌లీ, గాయపడ్డ సింహం… ఈ లిస్ట్ చాంతాడంత ఉంది. పెట్టుబడిలో సగం కూడా రాలేదు.

ధురంధర్-2 …స్ట్రెయిట్ తెలుగు సినిమాలు ఫ్లాప్ అవుతుంటే, ఈ డబ్బింగ్ సినిమా మాత్రం రూ. 50 కోట్ల గ్రాస్‌తో టాలీవుడ్‌లో మూడో హయ్యెస్ట్ కలెక్షన్ల సినిమాగా నిలిచి షాకిచ్చింది.

సూర్య వీరభద్రుడు… ఓకే అనిపించుకోగా… బ్లాస్ట్ జోన్, యూత్ చిత్రాలు బయ్యర్లకు ప్రాఫిట్స్ తెచ్చాయి. కానీ, మలయాళ దృశ్యం 3, కన్నడ కేడీ డబ్బింగ్స్ ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి.

కొత్త సినిమాలు లేని ఫిబ్రవరి, మే డ్రై సీజన్లలో స్టార్ హీరోల బర్త్‌డేలకి 4కె రీ-రిలీజ్ హంగామా నడిచింది. కానీ అది జస్ట్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్, ఒకట్రెండు షోలకే పరిమితమైంది.

ఆడియన్స్ క్లియర్ కట్‌గా ఒక మెసేజ్ ఇచ్చేసారు. కేవలం భారీ బడ్జెట్, ఇంటర్నేషనల్ లొకేషన్స్, స్టార్ హీరోల కటౌట్లు ఉంటే థియేటర్లకి రారు. కంటెంట్ ఈజ్ ది కింగ్… స్ట్రాంగ్ కథ ఉంటేనే సినిమాని ఆదరిస్తారు, లేదంటే ఓపెనింగ్స్ కూడా ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తారు. సమ్మర్ లాంటి క్రేజీ సీజన్ కూడా కంటెంట్ లేక నీరుగారిపోయింది. టాలీవుడ్‌కి ఈ ఆరు నెలల్లో లాభాల కంటే నిట్టూర్పులే ఎక్కువ మిగిలాయి. నెక్స్ట్ హాఫ్‌లో అయినా మన మేకర్స్ రూట్ మారుస్తారేమో చూడాలి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media