రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ మూవీ అప్‌డేట్స్ కోసం వేచి చూస్తున్న అభిమానులకు మేకర్స్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న కియారా అద్వానీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నేడు విడుదల చేశారు. ఇందులో ఆమె ‘నాడియా’ అనే పాత్రను పోషిస్తున్నారు.

సర్కస్ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న ఈ పోస్టర్‌లో కియారా స్టైలిష్ బ్లాక్ గౌనులో కనిపిస్తున్నారు. ఆమె కళ్ల నుండి కన్నీళ్లు కారుతున్నట్లు ఉండటం చూస్తుంటే, ఈ పాత్రలో ఎమోషనల్ డెప్త్ చాలా ఎక్కువగా ఉంటుందని అర్థమవుతోంది. కియారా నటన ఈ చిత్రంలో ఒక నటిగా ఆమెను సరికొత్తగా ఆవిష్కరిస్తుందని దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కొనియాడారు. ‘టాక్సిక్’ చిత్రం 2026 మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. యశ్, కియారాతో పాటు నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా మరియు రుక్మిణి వసంత్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు
