కన్నడ స్టార్ యశ్ నటించిన మోస్ట్ అవేటెడ్ చిత్రం ‘టాక్సిక్’ టీజర్ నేడు (ఫిబ్రవరి 20) విడుదలై ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో యశ్ సరికొత్త ‘క్లీన్ షేవ్’ లుక్తో షాక్ ఇచ్చాడు. అయితే, ఈ టీజర్ చూసిన నెటిజన్లు రణవీర్ సింగ్ సినిమాను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
వచ్చే నెల మార్చి 19న ‘టాక్సిక్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సరిగ్గా అదే రోజున ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ సీక్వెల్ ‘ధురంధర్ 2’ కూడా థియేటర్లలోకి రానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ క్లాష్ ఖాయమైంది. “ధురంధర్ ప్రమాదంలో పడింది”, “యశ్ దెబ్బకు రికార్డులు గల్లంతే” అంటూ సోషల్ మీడియాలో ‘టాక్సిక్’ టీజర్ రియాక్షన్లు హోరెత్తుతున్నాయి.
