ట్రాన్స్‌జెండర్స్‌కు ఆటోలు పంపిణీ.. మంత్రి D.S. B.V. Swamy

March 25, 2026 2:48 PM

ట్రాన్స్‌జెండర్స్ స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మంత్రి D.S. B.V. Swamy ట్రాన్స్‌జెండర్స్‌కు సబ్సిడీతో ఆటోలు పంపిణీ చేశారు.

ట్రాన్స్‌జెండర్స్ సమాజంలో గౌరవంగా జీవించాలనే ఉద్దేశ్యంతో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే విశాఖలో 20 మంది ట్రాన్స్‌జెండర్స్‌ను కేజీహెచ్‌లో శానిటేషన్ సూపర్వైజర్లుగా నియమించామని చెప్పారు.మరిన్ని ట్రాన్స్‌జెండర్స్‌ను గుర్తించి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వారికి గుర్తింపు కార్డులు అందజేస్తూ, సింగిల్ రేషన్ కార్డుల జారీకి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.అదేవిధంగా స్వయం సహాయక బృందాల ఏర్పాటు, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వంటి పథకాల ద్వారా ట్రాన్స్‌జెండర్స్ అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media