వైట్‌హౌస్‌లో టెక్ దిగ్గజాలతో సమావేశం
అమెరికా: అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పేరును మార్చే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై AIని అధికారికంగా “సూపర్ ఇంటెలిజెన్స్” (Super Intelligence – SI)గా పిలవనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు.
వైట్‌హౌస్‌లో పలువురు ప్రముఖ టెక్ దిగ్గజాలు, సీఈఓలతో సమావేశం నిర్వహించిన తర్వాత ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన టెక్ బాస్‌లతో చర్చించిన తర్వాతే ఈ పేరును అధికారికంగా మార్చినట్లు ఆయన మీడియాకు తెలిపారు.
ఈ సమావేశంలో టెక్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఆంత్రోపిక్ ప్రతినిధి డారియా అమోడై, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, ఓపెన్‌ఏఐకి చెందిన గ్రెగ్ బ్రాక్‌మన్, ఎలాన్ మస్క్, ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ తదితరులు ఈ నిర్ణయానికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు.
‘సూపర్ ఇంటెలిజెన్స్’ పదానికి ప్రాధాన్యం
అమెరికా అధ్యక్షుడు సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో ఈ పేరు మార్పుకు కారణాలను వివరించారు. కేవలం మానవ మేధస్సును అనుకరించడం లేదా కొన్ని పనులను ఆటోమేట్ చేయడం మాత్రమే AI పరిధి కాదని అందులో పేర్కొన్నారు.
AI సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోందని ఉత్తర్వులు పేర్కొన్నాయి.
ఈ టెక్నాలజీకి ఉన్న విస్తృత సామర్థ్యాలను “సూపర్ ఇంటెలిజెన్స్” అనే పదం మరింత స్పష్టంగా ప్రతిబింబిస్తుందని వివరించారు.
సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు కేవలం కృత్రిమ మేధస్సుకే పరిమితం కావడం లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఇది సరికొత్త “సూపర్ ఇంటెలిజెన్స్” శకానికి నాంది పలుకుతోందని పేర్కొన్నారు.
ఫెడరల్ ప్రభుత్వంలో ఉపయోగించే పదజాలం కూడా ఈ టెక్నాలజీ పరిధులను ప్రతిబింబించేలా ఉండాలని తెలిపారు.
ఇంకా పూర్తిగా సాకారం కాని సూపర్ ఇంటెలిజెన్స్
అయితే మానవ మేధస్సును అన్ని విధాలుగా మించే స్థాయి సాంకేతికత ఇప్పటివరకు పూర్తిగా సాకారం కాలేదు. ఈ స్థాయిని “సూపర్ ఇంటెలిజెన్స్”గా పేర్కొంటున్నారు.
ప్రస్తుతం AI టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అదే సమయంలో ఈ టెక్నాలజీపై నియంత్రణలు అవసరమనే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి.
ఇలాంటి సమయంలో AIకి బదులుగా “SI” అనే పదాన్ని అధికారికంగా ఉపయోగించాలనే నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
60 రోజుల్లో నిర్వచనం ఖరారు చేయాలని ఆదేశం
“సూపర్ ఇంటెలిజెన్స్”కు సంబంధించిన కచ్చితమైన ఫెడరల్ నిర్వచనాన్ని ఖరారు చేయడానికి ట్రంప్ 60 రోజుల గడువు విధించారు.
ఈ బాధ్యతను సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యక్ష సహాయకుడికి (APST) అప్పగించారు.
నిర్ణీత గడువులోగా “సూపర్ ఇంటెలిజెన్స్”కు సంబంధించిన ఫెడరల్ నిర్వచనాన్ని ఖరారు చేయాలని ఆదేశించారు.
దీంతో అమెరికా ప్రభుత్వ పరిధిలో AIకి సంబంధించిన పదజాలంలో మార్పు తీసుకురావడానికి చర్యలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.



