తిరుమల శ్రీవారి పరకామణి కేసు దర్యాప్తులో భాగంగా, టీటీడీ మాజీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి ఏపీ సీఐడీ పిలుపు మేరకు విచారణకు హాజరయ్యారు.
సీఐడీ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు తాను స్పష్టమైన వివరణలు ఇచ్చినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల పరకామణి విషయంలో జరిగిన ఘటన అత్యంత విచారకరమైనదని వ్యాఖ్యానించారు.
ఈ సంఘటన తన హయాంలో జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలోనే విచారణకు వచ్చానని తెలిపారు. చట్టపరమైన ప్రక్రియలో పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేసిన ఆయన, సమగ్ర విచారణ అనంతరం దోషులను గుర్తించి శిక్ష విధించే బాధ్యత కోర్టుదేనని పేర్కొన్నారు.
