TTD లడ్డూ వివాదం చంద్రబాబుకు దేవుడే బుద్ధి చెప్పాలి శ్రీకాంత్ రెడ్డి

January 31, 2026 1:04 PM

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు అవాస్తవాలని సిట్ (SIT) క్లీన్ చీట్ ఇచ్చిన నేపథ్యంలో, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి రాయచోటి వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్రమైన ప్రసాదంపై బురదజల్లి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఆయన వేడుకున్నారు.
తిరుమల లడ్డూ విషయంలో వైఎస్ఆర్సీపీకి ‘క్లీన్ చీట్’ లభించినందుకు కృతజ్ఞతగా శ్రీకాంత్ రెడ్డి తన నియోజకవర్గ నాయకులతో కలిసి ఆలయంలో 100 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఏడాది పాటు సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ జరిపిన సిట్.. కల్తీ నెయ్యి వాడలేదని తేల్చి చెప్పిందని, ఇది తమ పార్టీ నిజాయితీకి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కేవలం రాజకీయం కోసమే పవన్ కళ్యాణ్, చంద్రబాబులు జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ అంటూ నాటకాలు ఆడారని.. దీనివల్ల శాఖాహారులు, బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని మండిపడ్డారు. వాస్తవాలు బయటపడ్డాక కూడా యల్లో మీడియా, కూటమి నేతలు తప్పుడు ప్రచారం ఆపడం లేదని, తక్షణమే భక్తులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media