Suryapet districtలోని Chinthalapalem మండలం చింత్రియాల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గేదలను తీసుకురావడానికి Krishna Riverలోకి దిగిన ఇద్దరు బాలురు మునిగి మృతి చెందారు.

గ్రామానికి చెందిన అన్నదమ్ములు సమీర్, సద్దాం నదిలోకి దిగగా తిరిగి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గజఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా నేడు ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.రంజాన్ సెలవుల నేపథ్యంలో వారు Chilakaluripet సమీపంలోని ఉర్దూ మాధ్యమ మదర్సాలో చదువుతూ స్వగ్రామానికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
