United Kingdom ప్రభుత్వం పొగాకు వినియోగాన్ని నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 2009 తర్వాత పుట్టిన వారికి సిగరెట్లు అమ్మకాన్ని పూర్తిగా నిషేధించే బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు కేవలం సిగరెట్లకే పరిమితం కాకుండా వేపింగ్ (ఈ-సిగరెట్లు) మరియు ఇతర నికోటిన్ ఉత్పత్తులపై కూడా కఠిన నియంత్రణలు విధిస్తోంది.

వేపింగ్ ఉత్పత్తుల ఫ్లేవర్స్, ప్యాకేజింగ్, మార్కెటింగ్‌పై ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ ఉంటుంది. పిల్లల ఆటస్థలాలు, స్కూళ్లు, ఆసుపత్రుల పరిసరాల్లో వేపింగ్‌ను పూర్తిగా నిషేధించారు. అయితే ధూమపానం మానాలనుకునే వారికి ఆసుపత్రుల సమీపంలోని కొన్ని ప్రదేశాల్లో వేపింగ్‌కు మినహాయింపు ఇచ్చారు. పబ్ గార్డెన్లు, బీచ్‌లు, ప్రైవేట్ ప్రాంతాల్లో మాత్రం ప్రస్తుతం ధూమపానం అనుమతిస్తున్నారు.ఈ బిల్లుపై స్పందించిన ఆరోగ్య శాఖ కార్యదర్శి Wes Streeting, “నివారణ చికిత్స కంటే ఉత్తమం. ఈ నిర్ణయం ప్రాణాలను కాపాడటమే కాకుండా జాతీయ ఆరోగ్య వ్యవస్థపై భారాన్ని తగ్గిస్తుంది” అని తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి Baroness Merron ఈ చర్యను “తరంలోనే అతిపెద్ద ప్రజారోగ్య విప్లవం”గా పేర్కొన్నారు.అయితే ఈ నిర్ణయంపై పొగాకు పరిశ్రమలు, రిటైలర్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ, భవిష్యత్ తరాన్ని పొగాకు వ్యసనాల నుంచి కాపాడేందుకు ఇది సాహసోపేతమైన నిర్ణయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
