అగ్రరాజ్యం దిశగా భారత్:2026 ‘నిర్మల’ సంకల్పం!

February 2, 2026 12:35 PM

2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 9వ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వరుసగా 9 సార్లు బడ్జెట్ సమర్పించి ఆమె రికార్డు సృష్టించారు. దేశ చరిత్రలో మొదటిసారి ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం విశేషం.

1)మౌలిక సదుపాయాలకు పెద్దపీట: కేపెక్స్ (Capex) వ్యయాన్ని ₹12.2 లక్షల కోట్లకు పెంచారు. 7 కొత్త హై-స్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారు. ఇందులో దక్షిణ భారత్‌కు వరంగా చెన్నై-బెంగళూరు-హైదరాబాద్ ‘హై-స్పీడ్ డైమండ్’ ప్రాజెక్ట్ నిలవనుంది.

2)ఆదాయపు పన్ను సంస్కరణలు: పన్ను స్లాబుల్లో మార్పులు చేయనప్పటికీ, ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకి రానుంది. విదేశీ విద్య, వైద్యం కోసం పంపే నిధులపై TCS ను 5% నుండి 2%కి తగ్గించడం మధ్యతరగతికి ఊరట.

3)హైటెక్ విప్లవం: ‘సెమీకండక్టర్ ఇండియా మిషన్ 2.0’ మరియు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ తయారీ (ECMS) కోసం ₹40,000 కోట్లు కేటాయించారు.

4)ఆరోగ్యం & సామాన్యం: 17 రకాల క్యాన్సర్ మందులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. మొబైల్ ఫోన్లు, ఆప్టికల్ పరికరాలు చౌక కానున్నాయి.

5)మూడు కర్తవ్యాలే దిక్సూచి: ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం, అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ద్రవ్యలోటును 4.3 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media