దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శనివారం దర్శించుకున్నారు. ఆయనతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా స్వామి, అమ్మవార్ల సేవలో పాల్గొన్నారు.

ఆలయానికి చేరుకున్న మంత్రికి ఈవో బాపిరెడ్డి దర్శన ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితా రెడ్డి మరియు పాలకమండలి సభ్యులు వారికి ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం పలికారు. స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్షేత్ర సందర్శనకు రావడం పట్ల స్థానిక నేతలు సంతోషం వ్యక్తం చేశారు
