శ్రీ ఉపమాక కల్కి వెంకటేశ్వర స్వామి దేవస్థానం మహోత్సవాల్లో భాగంగా రేపు నిర్వహించనున్న పౌర్ణమి సముద్ర స్నానాలకు రాజయ్యపేట తీరం ముస్తాబైంది. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం రాజయ్యపేట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు.
గ్రామ సర్పంచ్ పిక్కి అప్పలనర్స, ఎంపీటీసీ పిక్కి సత్తియ్య నేతృత్వంలో ఈ ఏర్పాట్లు జరిగాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా రోడ్డుకు ఇరువైపులా ఉన్న పొదలను బుల్డోజర్‌తో తొలగించి విశాలమైన పార్కింగ్ స్థలాన్ని సిద్ధం చేశారు. సముద్ర స్నానాల అనంతరం మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ఐదు ప్రత్యేక సైడ్‌వాల్స్ (Changing Rooms) ఏర్పాటు చేశారు. గ్రామ కార్యదర్శి సత్యం, టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు పిక్కి గంగరాజు పర్యవేక్షణలో పారిశుధ్యం మరియు ఇతర మౌలిక వసతులను సిద్ధం చేశారు.భక్తులు నిబంధనలు పాటిస్తూ, అధికారులకు సహకరించి పౌర్ణమి మహోత్సవాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
