ఉరవకొండలో కూలీల ఆటో బోల్తా మహిళ మృతి, పలువురికి గాయాలు

March 26, 2026 1:41 PM

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం నింబగళ్లు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. మృతురాలు హసీనా (45)గా గుర్తించారు.

మిరప కోతలకు వెళ్తున్న 13 మంది కూలీలతో ఆటో ప్రయాణిస్తుండగా, ఇసుక ట్రాక్టర్‌ను తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మరో పదిమందికి గాయాలయ్యాయి.గాయపడిన వారిని స్థానికులు 108 అంబులెన్స్ సహాయంతో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media