క్షిపణి దాడులతో పెరిగిన ఉద్రిక్తత
అమెరికా, ఇరాన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. గత రెండు రోజులుగా ఇరాన్.. అమెరికా నావికాదళ యుద్ధనౌకను లక్ష్యంగా చేసుకుని రెండుసార్లు బాలిస్టిక్ క్షిపణులతో దాడికి ప్రయత్నించింది. దీంతో మధ్యప్రాచ్యంలో మరోసారి తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొంది.
అయితే ఇరాన్ ప్రయోగించిన క్షిపణి దాడులను అమెరికా యుద్ధనౌక విజయవంతంగా తిప్పికొట్టింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) స్పష్టం చేసింది.
క్షిపణి దాడి విఫలమైనప్పటికీ.. అమెరికా, ఇరాన్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ చర్యకు ప్రతిస్పందనగా అమెరికా సైన్యం కీలక దాడులకు దిగింది.
ఐదు ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా దాడులు
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కు చెందిన ఆయిల్-స్మగ్లింగ్ నెట్వర్క్తో సంబంధం ఉన్న ఐదు నౌకలను అమెరికా బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఆయిల్ ట్యాంకర్లపై వరుస దాడులు జరిపాయి.
గల్ఫ్ ఆఫ్ ఓమన్లోని ఎం/టీ కవిజ్, ఎం/టీ చార్మినార్, ఎం/టీ హొరైజన్ 1, ఎం/టీ రిస్కో నౌకలను అమెరికా బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఖార్గ్ ద్వీపం సమీపంలోని ఎం/టీ డెరియా నౌకపైనా దాడి జరిగింది.
ఈ దాడులకు ముందు నౌకల్లో ఉన్న సిబ్బందిని సురక్షితంగా బయటకు వెళ్లాలని అమెరికా బలగాలు ఆదేశించాయి.
సిబ్బంది నౌకల నుంచి బయటకు వెళ్లిన తర్వాత ట్యాంకర్లను పూర్తిగా ధ్వంసం చేసినట్లు సమాచారం.
ఇరాన్ ఆయిల్ నెట్వర్క్పై ఆరోపణలు
ఈ నౌకలు సాధారణ వాణిజ్య కార్యకలాపాల కోసం మాత్రమే ఉపయోగించడం లేదని CENTCOM ఆరోపించింది.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), దాని అనుబంధ ఉగ్రవాద గ్రూపులకు నిధులు సమకూర్చే నెట్వర్క్లో ఈ ట్యాంకర్లు భాగమని తెలిపింది.
బిలియన్ల కొద్దీ డాలర్ల విలువైన ‘షాడో నెట్వర్క్’ ద్వారా ఇరాన్ చమురు విక్రయాలు, రవాణా నిర్వహిస్తోందని CENTCOM పేర్కొంది.
ఈ నెట్వర్క్ ద్వారా వచ్చే నిధులు IRGC, దాని అనుబంధ గ్రూపులకు చేరుతున్నాయని అమెరికా ఆరోపించింది.
రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు క్షిపణి దాడి
అమెరికా నావికాదళ యుద్ధనౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ రెండుసార్లు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించేందుకు ప్రయత్నించింది.
ఈ రెండు దాడులను అమెరికా యుద్ధనౌక విజయవంతంగా అడ్డుకుంది.
దాడులను ఎదుర్కొనేందుకు అమెరికా నౌకాదళం తన రక్షణ వ్యవస్థలను ఉపయోగించింది. క్షిపణులు లక్ష్యాన్ని చేరకముందే వాటిని అడ్డుకున్నట్లు CENTCOM వెల్లడించింది.
ఈ ఘటనలో అమెరికా సిబ్బందికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది. యుద్ధనౌకకు జరిగిన నష్టం గురించి మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు
అమెరికా, ఇరాన్ మధ్య ఇప్పటికే కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఈ ఘటనలతో మరింత పెరిగాయి. ఒకవైపు ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో అమెరికా నౌకను లక్ష్యంగా చేసుకుంది.
మరోవైపు అమెరికా బలగాలు ఇరాన్ ఆయిల్-స్మగ్లింగ్ నెట్వర్క్తో సంబంధం ఉన్న ఐదు ట్యాంకర్లను ధ్వంసం చేశాయి.
దీంతో గల్ఫ్ ఆఫ్ ఓమన్, ఖార్గ్ ద్వీపం పరిసర ప్రాంతాల్లో పరిస్థితులు మరింత సున్నితంగా మారాయి.
ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో పెద్ద స్థాయి సైనిక ఘర్షణకు దారితీస్తాయా అనే ఆందోళనలు నెలకొన్నాయి.



