అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ తాజాగా ‘x’ (ట్విట్టర్) వేదికగా విడుదల చేసిన వీడియోలో, అమెరికన్ యువత స్థానంలో కంపెనీలు విదేశీ కార్మికులను తక్కువ జీతాలకు నియమించుకుంటున్నాయని ఆరోపించింది. హెచ్-1బీ వీసాలను కొన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయంటూ తీవ్ర విమర్శలు చేసింది.వీడియోలో ముఖ్యంగా హెచ్-1బీ వీసాదారులలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉందని ప్రత్యేకంగా ప్రస్తావించడం ఆందోళన కలిగిస్తోంది. ఇది భారతీయ టెకీలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ట్రంప్ వలస విధానాలపై కఠినంగా వ్యవహరించారు. అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించివేయడం, చట్టబద్ధమైన వీసాలపైనా కఠిన నియంత్రణలు విధించడం వంటి చర్యలు చేపట్టారు.ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ట్రంప్ మళ్లీ వలస సమస్యను ప్రధాన రాజకీయ అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. హెచ్-1బీ వీసాలపై ఈ తాజా దృష్టి, అమెరికాలో పనిచేస్తున్న వేలాది భారతీయ ఐటీ నిపుణుల్లో ఆందోళన రేపుతోంది.
USA:హెచ్-1బీ వీసాదారులపై ట్రంప్ కఠిన వైఖరి భారతీయ Techie ల ఆందోళన
