Ustaad Bhagat Singh చిత్రానికి సెన్సార్ పూర్తైంది. Pawan Kalyan హీరోగా, Harish Shankar దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.

చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా క్లియర్ అయ్యిందని మూవీ టీమ్ వెల్లడించింది. ఈ సందర్భంగా హీరో పవన్ కళ్యాణ్, హీరోయిన్ Sreeleela కలిసి నడుస్తున్న పోస్టర్‌ను విడుదల చేశారు.ఈ సినిమా 2 గంటల 34 నిమిషాల రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉగాది కానుకగా మార్చి 19న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
