జమ్మలమడుగులో Govt schoolsను కాపాడుదాం: UTF పిలుపు

April 20, 2026 11:11 AM

“ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం – ఊరి బడిని కాపాడుకుందాం” అనే నినాదంతో జమ్మలమడుగులో యుటిఎఫ్ ఆధ్వర్యంలో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు.

యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మీరాజ, జాబీర్ మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన విద్య అందాలంటే ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ విధానాల కారణంగా పాఠశాలలు సంక్షోభంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలంటే విద్యార్థుల నమోదు పెంపు, తల్లిదండ్రుల అవగాహన, ప్రజా ప్రతినిధుల సహకారం కీలకమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తూ ప్రభుత్వ బడులను కాపాడేందుకు యుటిఎఫ్ కార్యాచరణ కొనసాగిస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, ఉపాధ్యాయులు మరియు యుటిఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media