తమిళనాడులో ఉత్తమ్ చురుకుగా ప్రచారం

April 12, 2026 7:18 PM

ఈ నెల 23 న తమిళనాడులో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు బహుముఖ వ్యూహం రూపొందిస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు అనుసరించాల్సిన విధి విధానాలను రూపొందించి ఎన్నికల బరిలో విజయం సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. తమిళనాడు,పుదుచ్చేరి రాష్ట్రలలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ సీనియర్ పరిశీలకుడిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించిన విషయం విదితమే.

ఆరుసార్లు శాసనసబ్యుడిగా లోకసభ సభ్యుడిగా ఒక మారు ఎన్నికకావడంతో పాటు పి.సి.సి అధ్యక్షుడిగా పనిచేసిన అపార అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న ఏ.ఐ సి.సి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సీనియర్ పరిశీలకుడిగా స్టార్ క్యాంపెయన్ గా నియమిస్తూ ఇటీవల పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణా రాష్ట్రం నుండి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లను స్టార్ క్యాంపేయనర్ లూగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించింది.

అందులో భాగంగా చెన్నై కేంద్రంలో నియోజకవర్గ స్థాయి పార్టీ పరిశీలకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచార వ్యూహం, సమన్వయం తో పాటు పార్టీ సంస్థాగత పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై తనతో పాటు ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన ముఖుల్ వాస్నిక్,ఖాజా మోహినోద్దీన్ లతో కలసి సమీక్షించినట్లు ఆయన తెలిపారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి అవసరమైన మార్గదర్శనం గురుంచి నియోజకవర్గ స్థాయి పరిశీలకులతో చర్చించినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ పార్టీ యంత్రాంగాన్ని రాష్ట్ర స్థాయి నాయకత్వంతో సమన్వయం చేయడం క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media