కొడుకును కాపాడే క్రమంలో తండ్రి ప్రాణాలు కోల్పోయాడు..

June 20, 2026 1:23 PM
Father and son killed in train accident in Uttar pradesh.

Uttar Pradesh: కుటుంబ గొడవతో ఆత్మహత్యకు యత్నించిన కుమారుడు..

Uttar Pradesh: కుటుంబ గొడవ తీవ్ర విషాదానికి దారితీసింది. కుమారుడిని ఆత్మహత్య నుంచి కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రి కూడా రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. గౌరీబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉద్యోగ్ నగర్‌కు చెందిన శ్రావణ్ జైస్వాల్ (55), ఆయన కుమారుడు రాకేష్ జైస్వాల్ (24) శుక్రవారం రాత్రి మోటార్‌సైకిల్‌పై మార్కెట్‌కు వెళ్లారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

దారిలో కూడా వారు గొడవపడుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వివాదం మరింత పెరగడంతో రాకేష్ బైక్‌ను గోరఖ్‌పూర్–ఛప్రా రైల్వే మార్గంలోని గౌరీబజార్ పశ్చిమ రైల్వే క్రాసింగ్ వైపు తీసుకెళ్లాడు. అక్కడ కూడా తండ్రి, కుమారుడి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది.

అదే సమయంలో గోరఖ్‌పూర్(uttar pradesh) వైపు నుంచి రైలు వస్తుండగా రాకేష్ ఒక్కసారిగా పట్టాలపైకి వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే కుమారుడిని బయటకు లాగేందుకు శ్రావణ్ పరుగెత్తారు.

అయితే అప్పటికే రైలు ఇద్దరినీ ఢీకొట్టడంతో ఘటనాస్థలంలోనే వారు మృతి చెందారు. ఈ ఘటనతో పరిసర ప్రాంతంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.

సమాచారం అందుకున్న వెంటనే రుద్రపూర్ సర్కిల్ ఆఫీసర్ సత్యేంద్ర కుమార్ రాయ్తో పాటు పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అవసరమైన ఆధారాలు సేకరించి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసి, అక్కడి నుంచి అవసరమైన ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాల కారణంగానే ఈ విషాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాల ఆధారంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media