Vadapalliలోని Sri Venkateswara Swamy Temple Vadapalli అభివృద్ధికి రూ.1.35 కోట్లతో పలు పనులను ప్రారంభించినట్లు Bandaru Satyananda Rao తెలిపారు.

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో స్టెయిన్‌లెస్ స్టీల్ క్యూలైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్‌ను ప్రారంభించారు. ఆలయానికి వచ్చే భక్తులకు దర్శనం, లడ్డూ టిక్కెట్లు జారీ చేసే టిక్కెట్ మిషన్‌ను కూడా ప్రారంభించారు.

పుష్కర ఘాట్, కోనేరు అభివృద్ధి పనులు, వకుళమాత అన్నదాన భవనం నిర్మాణం, పార్కింగ్ స్థలం వంటి పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వాడపల్లిని తిరుమల తరహాలో అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

